PDPL: మంథని డిపో వద్ద సీఐటీయూ మండల కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ బస్సుల అంశంపై ధర్నా నిర్వహించారు. ఎలక్ట్రిక్ బస్సుల సబ్సిడీలు ప్రైవేట్ కంపెనీలకే పరిమితం చేయడం వల్ల ఆర్టీసీకి నష్టం జరుగుతోందని సీఐటీయూ నాయకులు బూడిద గణేశ్ అన్నారు. బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసేలా చట్టంలో మార్పులు చేయాలని, పీఎంఈ సబ్సిడీని రిట్రోఫిట్ బస్సులకు వర్తింపజేయాలన్నారు.