Bhagwant Kesari: రెండు వారాల్లోనే.. ‘భగవంత్ కేసరి’ ఓటిటి డేట్ వచ్చేసింది!
అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన భగవంత్ కేసరి సినిమా.. బాలయ్య ఫ్యాన్స్‌కు దసరా పండగను కాస్త ముందే తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. కానీ అప్పుడే ఓటిటి డేట్ బయటికొచ్చేసింది.
అఖండ, వీరసింహారెడ్డి తర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్టాడు బాలయ్య. మార్నింగ్ షో నుంచే భగవంత్ కేసరి సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో.. ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా థియేటర్లకి పరుగులు తీశారు. బాలయ్య, శ్రీలీల కాంబినేషన్ బాగుందంటూ రిపీటెడ్ ఆడియెన్స్ కూడా ఉన్నారు. డే వన్ 30 కోట్ల గ్రాస్ వసూలు చేసిన భగవంత్ కేసరి.. ఫస్ట్ వీక్‌లో 112 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పటి వరకు మొత్తంగా 11 రోజుల్లో 130 కోట్లు రాబట్టి.. బాలయ్య కెరీర్లో భారీ వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. అయితే.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు వారాలు కూడా కంప్లీట్ అవకముందే.. ఓటిటి డేట్ వచ్చేసిందనే న్యూస్ వైరల్‌గా మారింది.
దసరా సందర్భంగా అక్టోబర్ 19న విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ అండ్ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది భగవంత్ కేసరి. ఇంకా ప్రమోషన్స్ చేస్తునే ఉన్నారు మేకర్స్. కానీ అప్పుడే ఓటిటి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం బాలయ్య క్రేజ్ ఓ రేంజ్లో ఉంది కాబట్టి.. ఫ్యాన్సీ రేటుకు భగవంత్ కేసరి రైట్స్ దక్కించుకుంది. అయితే ఈ చిత్రాన్ని యాభై రోజుల థియేట్రికల్ రన్ తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్ చెయ్యాలని అనుకున్నారట మేకర్స్.
కానీ అమెజాన్ ప్రైమ్ వారు హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా నెల రోజులలోపే స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. ఈ నేపథ్యంలో.. లేటెస్ట్ ఇన్ఫర్మెషన్ ప్రకారం ‘భగవంత్ కేసరి’ నవంబర్ 23 నుంచి ఓటిటిలోకి స్ట్రీమింగ్కు రానుందని తెలుస్తోంది. అంటే.. రిలీజ్ అయిన నెల రోజులకే భగవంత్ ఓటిటిలో సందడి చేయనుందన్న మాట. త్వరలోనే డిజిటల్ డేట్ గురించి క్లారిటీ రానుందని అంటున్నారు.