»Samajwadi Party Leader Azam Khan Wife Son Abdullah Get 7 Year Jail In Fake Birth Certificate Case
SP పార్టీ నేత, అతని భార్య, కుమారుడికి ఏడేళ్ల జైలు శిక్ష
సమాజ్ వాది పార్టీ సీనియర్ నేత అజమ్ ఖాన్, అతని భార్య, కుమారుడికి కోర్టు షాక్ ఇచ్చింది. ఫేక్ సర్టిఫికెట్ల కేసులో ఒక్కొక్కరికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఒక్క నెలలోనే అజమ్ ఖాన్ 4 కేసుల్లో దోషిగా తేలాడు. మరోవైపు అతని కుమారుడు రెండు కేసుల్లో దోషిగా ఉన్నాడు.
Samajwadi Party leader Azam Khan, wife, son Abdullah get 7-year jail in fake birth certificate case
Fake Birth Certificate: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh) విపక్ష పార్టీ సమాజ్ వాదీ( Samajwadi Party ) పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి అజంఖాన్(Azam Khan), భార్య తంజీన్ ఫాతిమా, కుమారుడు అబ్దుల్లా అజం ఖాన్లకు కోర్టు జైలు శిక్ష విధించింది. నకిలీ సర్టిఫికెట్ల కేసులో ముగ్గురికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ రాంపూర్‌లోని ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. గతంలో వీరిపై బీజేపీ ఎమ్మెల్యే ఆకాశ్ సక్సేనా ఫిర్యాదు చేశారు. దాంతో ఈ ముగ్గురిపై కేసు నమోదైంది.
కుమారుడు అబ్దుల్లా కోసం అజంఖాన్ రెండు తేదీలతో బర్త్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు సక్సేనా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా ఫోర్జరీకి కూడా పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రోజు ఉదయం రాంపూర్ లోని న్యాయస్థానంలో ఈ కేసు విచారణ జరిగింది. ఒక్కొక్కరికి ఏడెళ్ల జైలు శిక్ష పడిందని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ శివ ప్రకాష్ పాండే తెలిపారు. వివాదాస్పద రాజకీయ నాయకుడు అజంఖాన్ కు గత నెల రోజుల వ్యవధిలో శిక్ష పడిన కేసుల సంఖ్య నాలుగుకి చేరింది. ఆయన తనయుడు అబ్దుల్లా అజంఖాన్ రెండు కేసుల్లో దోషిగా తేలాడు.