లైగర్, జనగణమన.. ఈ రెండు సినిమాల గురించి సోషల్ మీడియా ఎన్నో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పుడైతే లైగర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుందో అప్పటి నుంచి హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత ఛార్మీ, డైరెక్టర్ పూరీలపై నెటిజన్లు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దీంతో సోషల్ మీడియాకు కొంత కాలం బ్రేకిస్తున్నానని.. పూరి కనెక్ట్స్‌తో మళ్లీ సాలిడ్‌గా బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పుకొచ్చింది ఛార్మీ. కానీ అసలు జనగణమన ప్రాజెక్ట్ ఉందా.. లేకుంటే ప్రస్తుతం పూరి ఏం చేస్తున్నాడు.. అనే విషయాల్లో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దాంతో విజయ్ దేవరకొండతో చేస్తున్న ‘జనగణమన’ సినిమా దాదాపుగా ఆగిపోయిందని ఫిక్స్ అయిపోయారు జనాలు.
అయితే చార్మీ సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పిన తర్వాత.. ‘లైగర్’ నష్టాలని భర్తి చేయలేక పూరి సతమతమవుతున్నాడని.. పూరి ముంబై ఆఫీస్ రెంట్ కట్టలేక హైదరాబాద్‌కు మకాం మారుస్తున్నాడంటూ.. రకరకాల వార్తలు తెరపైకొచ్చాయి. అంతేకాకుండా పూరి, చార్మి తమ దారులు తాము చూసుకున్నారని సోషల్ మీడియాలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మొత్తంగా పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్, ఆర్థిక స్థితి, లైగర్ సెటిల్మెంట్స్ ఇలా అనేక విషయాలు గురించి ఏదో ఒక న్యూస్ వినిపిస్తునే ఉంది. దీంతో సోషల్ మీడియాకు దూరంగా ఉంటానన్న చార్మీ.. మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘రూమర్స్.. రూమర్స్.. రూమర్స్.. అన్ని రూమర్స్ ఫేక్. పూరి కనెక్ట్స్ ప్రొగ్రెస్‌పై ఫోకస్ పెట్టాం.. అప్పటివరకు రిప్ రూమర్స్..’ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేసింది ఛార్మి. దాంతో అసలు జనగణమన సినిమా ఉందా.. లేదా, మీ పై వస్తున్న పుకార్లు నిజమేనా.. ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వండని అడుగుతున్నారు నెటిజన్స్. ఏదేమైనా పూరి, చార్మితో పాటు జనగణమన అసలు కథేంటో వాళ్లకే తెలియాలి.