Mokshagna: హాట్ టాపిక్‌గా మారిన శ్రీలీల, మోక్షజ్ఙ?
నందమూరి బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఙ ఎంట్రీ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఙ ఫిట్‌గా తయారయ్యాడు. అంతేకాదు.. ఓ కుర్ర హీరోయిన్‌తో కలిసి కనిపిస్తున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటి వరకు ఇదిగో, అదుగో అనే వార్తలు తప్పా.. నందమూరి వారసుడు మోక్షజ్ఙ లాంచింగ్ ఎప్పుడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్దమైనట్టేనని చెప్పొచ్చు. ఇప్పటికే వెయిట్ లాస్ హీరో కటౌట్‌లోకి వచ్చేశాడు మోక్షజ్ఙ. త్వరలోనే ఈ నందమూరి వారసుడు ఎంట్రీ ఉండనుందని అంటున్నారు. రీసెంట్గా భగవంత్ కేసరి ఈవెంట్లో.. నెక్స్ట్ నేను కుర్ర హీరోని వస్తున్నా.. శ్రీలీలతో హీరోయిన్గా ఎలా చేస్తావని.. మోక్షజ్ఞ తనపై కోప్పడ్డట్టు చెప్పుకొచ్చాడు బాలయ్య. దీంతో మోక్షజ్ఞ ఎంట్రీకి గ్రౌండ్ వర్క్ గట్టిగానే జరుగుతున్నట్టుంది. పైగా ఎప్పుడు మీడియా ముందుకురాని మోక్షజ్ఞ.. ఈ మధ్య బాగానే కెమెరా కంటికి చిక్కుతున్నాడు.
ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమా విషయంలో బాలయ్యతో కలిసి సందడి చేస్తున్నాడు మోక్షజ్ఙ. ముఖ్యంగా.. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి శ్రీలీల వెంటే కనిపిస్తున్నాడు మోక్షజ్ఙ. మొన్నటికి మొన్న సెట్లో ఆమెతో మాట్లాడుతూ కనిపించగా.. ఇప్పుడు ప్రమోషన్స్ లో సైతం ఆమె వెనుకే నిలబడి కనిపించాడు. దీంతో మోక్షజ్ఞ లాంచింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్గా కన్ఫర్మ్ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడ్డానికి ఈ ఇద్దరి జోడి బాగుందంటున్నారు. కథ కుదిరితే.. ఫ్యూచర్లో ఈ ఇద్దరు కలిసి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ఇది సినిమాటిక్ వెర్షన్ మాత్రమే.. కానీ శ్రీలీలతో కలిసి మోక్షజ్ఙ రెండు, మూడు సార్లు కనిపించడం మాత్రం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నడూ లేనిది శ్రీలీల చుట్టే మనోడు ఎందుకు తిరుగుతున్నాడు? మ్యాటర్ భగవంత్ కేసరినే అయినా.. అసలు మ్యాటర్ వేరే ఉందనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరి ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో.. వాళ్లకే తెలియాలి.