»Megafans In Confusion Three Star Directors For Chiru
confusionలో మెగాఫ్యాన్స్.. చిరు కోసం ముగ్గురు స్టార్ డైరెక్టర్స్?
ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి ఫ్లాప్స్ తర్వాత సాలిడ్ హిట్ కొట్టేందుకు రెడీ అవుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. అందుకోసం ఏకంగా ముగ్గురు బడా దర్శకుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ముగ్గురిలో ఎవరితో చిరు ప్రాజెక్ట్ సెట్ అవుతుంది.
Megafans in confusion.. Three star directors for Chiru?
Megafans: ఆగష్టు 22న చిరు బర్త్ డే గిఫ్ట్‌గా బింబిసార డైరెక్టర్ వశిష్టతో మెగా 157 ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. సోషియో ఫాంటసీగా రానున్న ఈ సినిమా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఎవరితో సినిమా చేయనున్నాడు.. అనే విషయంలో క్లారిటీ రావడం లేదు. ఇప్పటికే చిరు కోసం ఏకంగా ముగ్గురు స్టార్ డైరెక్టర్స్ పేర్లు వినిపిస్తున్నాయి.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చిరు ఓ సినిమా చేయబోతున్నట్టు గత రెండు, మూడు రోజులుగా వార్తలొస్తున్నాయి. అలాగే బోయపాటి శ్రీనుతో కూడా సినిమా ఉంటుందని.. ఇప్పటికే చిరుకి స్టోరీ కూడా చెప్పాడనే టాక్ నడుస్తోంది. ఇక ఇప్పుడు సుకుమార్ కూడా మెగాస్టార్‌తో లైన్లోకి వచ్చేశాడు. ఆ మధ్య సుకుమార్, చిరు కలిసి ఓ యాడ్ చేశారు. అప్పుడే ఈ కాంబినేషన్ సెట్ అయిందని అనుకున్నారు. కానీ ఇతర కమిట్మెంట్స్ కారణంగా సెట్ కాలేదు. ఇక ఇప్పుడు సుకుమార్‌తో దాదాపు ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని అంటున్నారు. అలాగే బోయపాటి, త్రివిక్రమ్ కూడా ఫైనల్ అంటున్నారు. దీంతో మెగాభిమానులంతా కన్ఫ్యూజన్లో పడిపోయారు.
మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో తేల్చుకోలేకపోతున్నారు. నెక్స్ట్ సినిమాల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇప్పటికే త్రివిక్రమ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. సుకుమార్ పుష్ప2తో బిజీగా ఉన్నాడు. బోయపాటి.. అఖండ2, స్కంద2 లైన్లో పెట్టాడు. మరో వైపు కళ్యాణ్ కృష్ణతో మెగా 156 కమిట్ అయ్యాడు చిరు. దీంతో మెగా 157 తప్పా.. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరితో చిరు సినిమా చేయడం గ్యారంటీ అంటున్నారు.