Perni Nani: స్కిల్ స్కామ్లో అరెస్టై జైలులో ఉన్న చంద్రబాబు పట్ల తెలంగాణ మంత్రి హరీశ్ రావు విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఆ ఇష్యూపై ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) తనదైన శైలిలో స్పందించారు. ఎన్టీఆర్కు చంద్రబాబు అల్లుడు.. కేసీఆర్కు హరీశ్ రావు అల్లుడు.. మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు.. హరీశ్ రావు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాడని ఘాటు ఆరోపణలు చేశారు. అల్లుళ్ల గిల్లుళ్ల గురించి అందరికీ తెలిసిందేనని పేర్కొన్నారు.
కేసీఆర్ తెలివైన వ్యక్తి కాబట్టి అల్లుడి గిల్లుడికి సమాధానం ఇస్తున్నాడని వివరించారు. 2018లో ఓసారి ఇలాంటి ప్రయత్నం చేయడంతో.. కొద్దీరోజులు మంత్రివర్గంలోకి తీసుకోలేదనే విషయాన్ని గుర్తుచేశారు. ఆ తర్వాత కార్యకర్తల ఒత్తిడి మేరకు తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా హరీశ్ రావు తిరుగుబాటు చేయడని గ్యారంటీ లేదని హింట్ ఇచ్చారు.
చంద్రబాబు వయస్సును దృష్టిలో ఉంచుకొని.. అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేదని ఓ సందర్భంలో హరీశ్ రావు అన్నారు. దానిని వైసీపీ నేతలు తమకు అనుకూలంగా మలచుకొని.. అల్లుడు గిల్లుడు అంటున్నారు. దీనిపై బీఆర్ఎస్ నేతల కౌంటర్ చేయాల్సి ఉంది. ఇటు తెలంగాణలో ఉన్న ఏపీ వారిని ఇక్కడి వారిగా గుర్తిస్తామని గతంలో హరీశ్ అన్న సంగతి తెలిసిందే. అదీ ఎన్నికల స్ట్రాటజీ అని ఏపీ నేతలు అప్పుడే విమర్శించారు.