ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సినిమా సలార్.. ఎట్టకేలకు రిలీజ్ డేట్‌ను లాక్ చేయడంతో.. ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ 31పై సాలిడ్ అప్డేట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్.
NTR-Prasanth Neel: ప్రస్తుతం తెరకెక్కుతున్న మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా సినిమాల్లో.. దేవర పై భారీ అంచనాలు ఉన్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో గ్లోబల్ లెవల్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ట్రిపుల్ ఆర్ తర్వాత తారక్ చేస్తున్న సినిమా కావడంతో.. మూవీ లవర్స్ అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అందుకే రిలీజ్‌కు ఏడు నెలల ముందే దేవర రికార్డుల వేట మొదలైంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ రికార్డు ధరకు అమ్ముడైనట్లు సమాచారం. దేవర ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు టాక్. ఈ సినిమా డిజిటల్ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ పోటీపడగా.. ఫైనల్‌గా నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఏకంగా 150 కోట్లకు దక్కించుకున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా దేవర రిలీజ్ కానుంది.
దేవర సినిమా తర్వాత ప్రశాంత్ నీల్‌తో 31వ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఎన్టీఆర్. ఇప్పటికే అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేశారు. సలార్ డిలే అవడంతో.. ఎన్టీఆర్ 31 లేట్ అవుతుందనే టాక్ నడుస్తోంది. తాజాగా సాలిడ్ అప్టేడ్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ఇటీవల జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్‌లో.. ఎన్టీఆర్ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది క్లారిటీ ఇచ్చాడు. ఈ లెక్కన హృతిక్ రోషన్ ‘వార్2’ షూటింగ్ అయిపోగానే.. ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అవనున్నాడు ఎన్టీఆర్. ఈ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అవడంతో.. ఎన్టీఆర్ 31 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ 31 సమ్మర్లో స్టార్ట్ అయితే.. సలార్ 2 రిలీజ్ ఎప్పుడనేది అర్థం కాకుండా పోయింది. మరి దీనిపై ప్రశాంత్ నీల్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో చూడాలి.