»Skanda Telugu Movie Review In Ram Pothineni Srileela Boyapati Srinu Combination
Skanda Movie Review: స్కంద మూవీ రివ్యూ
మాస్ హీరో రామ్ పోతినేని, బ్యూటీఫుల్ హీరోయిన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం స్కంద. మాస్ చిత్రాలను కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పుకునే దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.
Skanda Telugu Movie Review in Ram Pothineni Srileela Boyapati Srinu Combination
చిత్రం: స్కంద నటీనటులు : రామ్ పోతినేని, శ్రీలీల, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్, శరత్ లోహితాస్వా, దగ్గుబాటి రాజా తదితరులు. దర్శకత్వం : బోయపాటి శ్రీను నిర్మాత : శ్రీనివాస్ చిట్టూరి, పవన్ కుమార్ సంగీతం : తమన్ సినిమాటోగ్రఫీ : సంతోష్ దేటకే ఎడిటర్ : తమ్మిరాజు విడుదల తేది : 28/9/2023
Skanda Movie Review: దర్శకుడు బోయపాటి శ్రీను(Boyapati Srinu), హీరో రామ్ పోతినేని(Ram Pothineni) కాంబినేషన్లో స్కంద(Skanda) మూవీ ప్రకటించినప్పుడే తెలుగు ప్రేక్షకులు ఓ అంచనాకు వచ్చారు. సినిమాలో ఏ రేంజ్ యాక్షన్ సీన్స్ ఉంటాయోనని. బ్యూటీఫుల్ హీరొయిన్ శ్రీలీల(Srileela) హీరోయిన్గా నటించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లతో అభిమానులు సినిమాపై అంచనాలు పెంచుకున్నారు. ఇక డైరెక్టర్ బోయపాటి శ్రీను అఖండ వంటి భారీ సక్సెస్‌తో మంచి ఊపు మీదున్నాడు. అదే ఊపులో ఉస్తాద్ రామ్‌తో తెరకెక్కించిన స్కంద ఆడియన్స్‌ను ఏ మేరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
ఏపీ సీఎం కూతురుని తెలంగాణ సీఎం కొడుకు ఎత్తుకెళ్ళడంతో కథ మొదలు అవుతుంది. దీంతో తెలంగాణ సీఎం కొడుకును చంపి తన కూతురును తెచ్చకుంటానని ఛాలెంజ్ చేస్తాడు. తెలంగాణ సీఎం కొడుకు నుంచి ఏపీ సీఎం కూతురును తీసుకొచ్చే బాధ్యతను స్కందకు అప్పజెప్పుతాడు. దాంతో రంగంలోకి దిగిన స్కంద ఆంధ్ర సీఎం కూతురుతోపాటు తెలంగాణ సీఎం కూతురు (శ్రీలీల)ను కూడా తీసుకొని తన సొంత ఊరు రుద్రరాజ పురానికి వెళ్తాడు. అసలు స్కంద వారిని తీసుకొని తన ఊరికి ఎందుకు వెళ్ళాడు.? ఈ గ్రామానికి రెండు రాష్ట్రాల సీఎంలకు మధ్య సంబంధం ఏంటి.? రుద్రగంటి రామకృష్ణ రాజును ఇద్దరు సీఎంలు ఎలా మోసం చేశారు.? వారందరికి స్కంద ఎలా సమాధానం చెప్పాడు.? అనేది తెలియాలంటే స్కంద సినిమా చూడాల్సిందే.
ఎలాఉందంటే:
హీరో ఎవరైనా బోయపాటి శ్రీను(Boyapati Srinu) దర్శకత్వం అంటే ప్రేక్షకుడు మైండ్‌లో ఫిక్స్ అయిపోతాడు. గత సినిమాల తాలుకు ప్రభావం దృష్ట్యా బోయపాటి అంటే మాస్ యాక్షన్ సీన్స్ కి కేరాఫ్ అడ్రస్. అదే మార్క్‌తో అంతకు మించిన యాక్షన్ ఎపిసోడ్స్‌ను తెరకెక్కించారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని లోని ఎనర్జీ అంతా వాడుకొని, మాస్ హీరోని మాస్ ప్రేక్షకులకు ఎలా చూపించాలో అలానే చూపించారు. హీరోతో కత్తి పట్టించి వందలాది మందిని ఊచకోత కోయించాడు. తన లాస్ట్ సినిమా అఖండను మించిన యాక్షన్ అంటే అర్థం చేసుకోవచ్చు. కొన్ని లాజిక్స్ ఉండవు కేవలం బోయపాటి మ్యాజిక్ మాత్రమే ఉంటుంది. ఏకంగా రెండు రాష్ట్రాల సీఎంల వద్దకు స్కంద వెళ్లి వాళ్ళ కూతుళ్లను తీసుకొస్తాడు. వందల మంది సెక్యూరిటీ ఉన్నా కూడా స్కంద తీరు అతిశయోక్తిగా అనిపిస్తుంది. రామ్ ఎనర్జీ, శ్రీలీల గ్లామర్‌తో స్కంద మూవీ మాస్ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చుతుంది. విలనిజంలో బోయపాటి మార్క్ స్పష్టంగా కనిపిస్తుంది. గూస్ బంప్స్ తెప్పించే ఫైట్ సీన్స్ తో హై డ్రామా నడిపించాడు. ఇక సినిమాలో కావల్సినంత సెంటిమెంట్ కూడా ఉంది. యాక్షన్ తో పాటు ఎమోషన్ యాడ్ చేశారు. ఆచార సంప్రదాయాలను చూపిస్తూ తీసిన కొన్ని సీన్స్ థియేటర్లో కన్నుల పండుగలా ఉంటాయి. ఇక ప్రీ క్లైమాక్స్ సీన్స్ రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. చివరలో స్కంద ట్విస్ట్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుంది.
ఎవరెలా చేశారంటే..?
రామ్ పోతినేని తనదైన నటనతో, రెట్టించిన ఎనర్జీతో వెండితెరపై తన మార్క్‌ను చూపించాడు. యాక్షన్ సీన్స్ లో ఊరమాస్‌గా కనిపించి అభిమానులకు పిచ్చెక్కించాడు. హీరోయిన్ శ్రీలీల తన యాక్టింగ్, ఎనర్జీతో ఫర్వాలేదు అనిపించింది. సినిమా ఫుల్ యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యత ఉంది కాబట్టి తన పాత్ర కొంచెం తగ్గినట్లు అనిపిస్తుంది. రామ్ తో పోటీపడి డాన్స్ చేసి ప్రేక్షకుల చేత ఈలలు వేయించింది. మరో హీరోయిన్ సయీ మంజ్రేకర్ తన పాత్రకు న్యాయం చేసింది. శ్రీకాంత్, గౌతమి సహా ఇతర తారాగణం వారి వారి పాత్రల్లో బాగానే నటించారు. విలన్స్ రోల్స్ బాగున్నాయి. ప్రిన్స్ విలనిజం, బాహుబలి ప్రభాకర్ నటన బాగుంది.
సాంకేతిక అంశాలు
దర్శకుడు బోయపాటి శ్రీను తన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదు. హీరోను మాస్ ప్రేక్షకులకు చూపించడంలో ఆయన ఎక్కడా కాంప్రమైజ్ అవడు. ప్రేక్షకుడు ఇంత మాస్ అప్పిరియన్స్ను యాక్సెప్ట్ చేస్తాడా లేడా అన్నది ఆలోచించకుండా.. హీరో కొడితే పదిమంది ఒకే సారి కిందపడాలి అని తాను నమ్మిన థీమ్‌తో యాక్షన్ సీన్స్‌ను చూపించారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది.. సాంగ్స్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. హై బడ్జెట్ మూవీ కాబట్టి ఆ క్వాలిటీని మెయింటైన్ చేశారు నిర్మాతలు. ఇక సినిమాటోగ్రాఫి బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్‌గా కట్ చేస్తే బాగుండేది.