»17 Hours In The Queue For Iphone 15 Mumbai Apple Store
iPhone15sale: ఐఫోన్ 15 కోసం క్యూలైన్లో 17 గంటలు..ఎందయ్యా ఇది!
ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్లకు ఉన్న క్రేజ్ మరో బ్రాండుకు లేదనే చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నేడు భారత స్టోర్లకు వచ్చిన ఐఫోన్లు కొనేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున స్టోర్ల వద్దకు చేరుకున్నారు. కొంత మంది అయితే అర్ధరాత్రి నుంచే లైన్లలో వేచి ఉండి మరి ఫోన్లను తీసుకుని మురిసిపోతున్నారు.
17 hours in the queue for iPhone 15 mumbai apple store
ఐఫోన్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈరోజు ఐఫోన్ 15 సిరీస్ భారత మార్కెట్లోని స్టోర్లకు వచ్చింది. దీంతో ఈ ఫోన్ కోసం దేశంలోని రెండు స్టోర్ల దగ్గర తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున కస్టమర్లు లైన్లు కట్టారు. ఈ క్రమంలో ముంబైలో మొదటి ఐఫోన్ 15 కొనడానికి అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి 17 గంటల పాటు లైన్లో నిలబడినట్లు పేర్కొన్నాడు. అయితే అతను భారతదేశపు మొట్టమొదటి ఐఫోన్‌ను కొనుగోలు చేయడానికి అహ్మదాబాద్ నుంచి ముంబైకి ప్రత్యేకంగా వచ్చానని చెప్పుకొచ్చాడు. నిన్న మధ్యహ్నం 3 గంటల నుంచి ముంబైలోనే ఉన్నట్లు తెలిపాడు. అతను ఆపిల్ వాచ్ అల్ట్రా 2, కొత్త ఎయిర్‌పాడ్‌లతో పాటు వైట్ టైటానియం 256 GB మోడల్లో iPhone 15 Pro Max మోడల్‌ను బుక్ చేసుకున్నట్లు తెలిపాడు. యాపిల్ బ్రాండ్ గురించి చెప్పాలని కోరగా అతను చిరునవ్వుతో “బెస్ట్ హే” అంటూ పేర్కొన్నాడు. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ఈ ఫోన్ల విక్రయాలు మొదలయ్యాయి. వివేక్ అనే మరో కస్టమర్ తన కొత్త ఐఫోన్ 15 ప్రోని సేకరించిన మొదటి వ్యక్తిగా ఈ ఉదయం 4 గంటలకు Apple BKC స్టోర్‌కు చేరుకున్నానని పేర్కొన్నాడు.
https://x.com/ANI/status/1705056788150936022?s=20
దేశ రాజధాని ఢిల్లీలో రాహుల్ అనే కస్టమర్ కంపెనీ సాకేత్ స్టోర్ నుంచి ఐఫోన్ 15 ను కొనుగోలు చేసిన మొదటి వ్యక్తి అని చెప్పాడు. ఇది ఒక గొప్ప అనుభవమని, తాను ఉదయం 4 గంటల నుంచి క్యూలో ఉండి ఈ ఫోన్ కొన్నానని తెలిపాడు. అంతేకాదు ఇప్పటికే తన దగ్గర iPhone 13 Pro Max, iPhone 14 Pro Max ఉన్నాయని చెప్పాడు. ఐఫోన్ 15 సిరీస్‌లు ప్రకటించిన తర్వాత తాను ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ను తీసుకోవాలని ఫిక్స్ అయినట్లు స్పష్టం చేశాడు.