యంగ్ హీరో విజయ్ దేవరకొండ యాక్ట్ చేసిన ఖుషీ(Kushi) చిత్రం ఓటీటీ(OTT) స్ట్రీమింగ్ డేట్ ఖారారైనట్లు తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్ మంచి రేటుకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అయితే సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో ఈ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, రౌడీ హీరో విజయ్ దేవర కొండ జంటగా నటించిన చిత్రం ఖుషీ(Kushi). ఈ మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఈ ఖుషి చిత్రానికి భారీ ప్రీ రిలీజ్ హైప్ వచ్చింది. ఇది మొదటి వారాంతంలో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సహాయపడింది. ప్రొడక్షన్ టీమ్ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం ఖుషి మొదటి ఐదు రోజుల్లో రూ.70 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు.
రొమాంటిక్ డ్రామా ఫ్యామిలీ ఎంటర్ ట్రైనర్ గా ఈ మూవీ సాగింది. అయితే, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ థియేటర్లను స్వాధీనం చేసుకున్న తర్వాత, ఖుషీ వ్యాపారం క్షీణించడం ప్రారంభించింది. ఈ మధ్య, మేకర్స్ చిత్రం OTT విడుదల తేదీని వెల్లడించారు. ఖుషి OTT హక్కులను నెట్‌ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ రైట్స్‌ని కొనుగోలు చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తం చెల్లించిందని సమాచారం. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ సెప్టెంబర్ 30 లేదా అక్టోబర్ 4న ప్రారంభమవుతుంది. ఖుషి చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం సమకూర్చారు. ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, రాహుల్ రామకృష్ణ, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ కూడా కీలక పాత్రలు పోషించారు.