Bharat Mandapam : ఢిల్లీలోని భారత్ మండపంలో జీ20 సదస్సు జరిగింది. దాని ప్రత్యేకత గురించి చాలా చర్చ జరిగింది. ఇప్పుడు ఒక వీడియో ఆధారంగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఈ ఈవెంట్ ఏర్పాట్లపై ప్రశ్నలను లేవనెత్తాయి. ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ను నేరుగా ప్రశ్నలు అడిగారు. భారత్ మండపం సమీపంలో నీటితో నిండినట్లు ఈ వీడియోలో చూడవచ్చు. శనివారం వర్షం కురిసిన తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
భారత మండపం చుట్టూ చాలా నీరు నిండి ఉంది. దానిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న ఏర్పాట్లను వైరల్ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ వీడియోకు సంబంధించి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ సన్నాహాలు, బిజెపిపై ప్రశ్నలు లేవనెత్తాయి. కాంగ్రెస్ తన ట్వీట్లో ఇలా రాసింది, ‘బోలు అభివృద్ధి బట్టబయలు. జీ20కి భారత్ మండపం సిద్ధమైంది. రూ.2,700 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఒక్క వర్షంలో నీటితో నిండిపోయింది.’
Resp @LtGovDelhi saab,
This is very serious. Even after ur 50+ inspections, if the very main area around Mandapam is submerged in water, then heads must roll. I as Minister of Delhi don’t have control over this Central Govt area, else would have assisted u sir. pic.twitter.com/hn0dSBSA78
ఆప్ నాయకుడు, ఢిల్లీ ప్రభుత్వ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ట్విట్టర్లో ఢిల్లీ ఎల్జీని ట్యాగ్ చేసి, ‘గౌరవనీయమైన ఎల్జీ సర్, ఇది చాలా తీవ్రమైన విషయం. మీరు 50కి పైగా తనిఖీలు చేసినప్పటికీ, మండపం ప్రధాన ప్రాంతం నీటిలో మునిగిపోతుంటే, ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు. ఢిల్లీ ప్రభుత్వ మంత్రిగా, ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాంతం కాబట్టి దీనిపై నాకు నియంత్రణ లేదు, లేకపోతే నేను ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాను సార్. అయితే, ఈ ఉదయం కార్యక్రమానికి ముందు ఇక్కడ నీరు లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇంత పెద్ద ఈవెంట్లో వర్షం పడకుండా చర్యలు తీసుకోలేదా అని ప్రజలు రకరకాల ప్రశ్నలు అడుగుతున్నారు.