వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం (low pressure) బలహీనపడింది. దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఈ ప్రభావంతో తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ (Weather Dept) తెలిపింది. మరో నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ డిపార్టమెంట్ హెచ్చారించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ జేసింది. సోమవారనికి ఎలాంటి అలర్ట్ జారీ చేయని వాతావరణ శాఖ మంగళ, బుధవారాలకు సంబంధించి ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆదివారం కరీంనగర్ (Karimnagar),పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.హైదరాబాద్ (Hyderabad) లోని గచ్చిబౌలి, చందానగర్, షేక్ పేట్, ఎల్బీనగర్, దిల్ సుఖ్ నగర్, బంజారాహిల్స్(Banjara Hills), జూబ్లీహిల్స్, మాదాపూర్, మెహిదీపట్నం, మూసాపేట్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లో మరో నాలుగు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆలస్యంగా వచ్చిన నైరుతీ రుతుపవనాలు క్రియశీలకంగా ఉన్నాయి. సెప్టెంబర్ 9 నుంచి అవి తిరోగమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి ముందస్తుగానే ఈశాన్య రుతుపవనాల రాక మొదలు కావొచ్చని ఐఎండీ (IMD) అంచనా వేస్తున్నది.