How special is Pakistan's face bowler Shaheen Afridi?
Shaheen Afridi: ఆసియా కప్ 2023(Asia Cup 2023)లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ (India vs Pakistan) శ్రీలంక పల్లెకెలె(Pallekele) అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. ఎక్కువగా వినిపిస్తున్న పేరు షహీన్ అఫ్రిది (Shaheen Afridi). భారత జట్టుకు అతను పెద్ద ముప్పు అని కొందరు హెచ్చరిస్తున్నారు. అతడితో జాగ్రత్త అని భారత జట్టుకు సూచిస్తున్నారు. ఇంతకీ షహీన్ అఫ్రిది ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం.
షహీన్ అఫ్రిది వయసు 23 ఏళ్లు. అంతర్జాతీయ మేటి ఫాస్ట్బౌలర్లలో ఒకడిగా పేరుతెచ్చుకున్నాడు. పాకిస్థాన్‌తో ఏ జట్టు తలపడ్డా.. అందులో బ్యాటర్లు షహీన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తారు. జట్టులోకి వచ్చినప్పటి నుంచి.. అతడి మీదే దృష్టిపెడుతోంది. ప్రపంచ కప్పుల్లో పాక్‌పై ఓటమే ఎరుగని రికార్డుతో 2021 టీ20 ప్రపంచకప్‌లో బరిలోకి దిగిన టీమ్ఇండియాను షహీనే గట్టి దెబ్బ కొట్టాడు. కోహ్లి సహా టాప్ 3 బ్యాటర్లను ఆరంభంలో పెవిలియన్ చేర్చాడు. తద్వారా ప్రపంచకప్‌లో భారత్ (India Team)పై పాక్ తొలి విజయాన్ని అందుకోవడంలో కీ రోల్ పోషించాడు. ఆ పోరులో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా అతనే. గత ఏడాది టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్ నెగ్గినప్పటికీ.. ఆ మ్యాచ్‌లో రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. ఇప్పుడు ఆసియా కప్ మ్యాచ్ ముందు షహీన్ గురించి చర్చ జరుగుతోంది. అతన్ని భారత బ్యాటర్లకు ప్రధాన ముప్పుగా విశ్లేషకులు భావిస్తున్నారు. 145 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు వేయగలడు కాబట్టే షహీన్పై అందరి దృష్టి.
షహీన్ అఫ్రిది ఘనత
షహీన్ ఇప్పటి వరకు 27 టెస్టులు ఆడి 25.58 సగటుతో 105 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 40 మ్యాచ్‌లు ఆడి 23.08 సగటుతో 78 వికెట్లు తీశాడు. టీ20ల్లో 52 మ్యాచ్‌ల్లో 22.73 సగటుతో 64 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు చూస్తే అతనెంత మేటి బౌలరో అర్థమవుతుంది. అతను బ్యాటింగ్ అద్భుతంగా ఆడగలడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో విరుచుకుపడగలడు. ఇక షహీన్ అఫ్రిది పాకిస్థాన్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది (Shahid Afridi) అల్లుడు కావడం విశేషం. షహీన్‌తో పాటు ఆరుగురు సోదరులుండగా.. ఇతనే చివరి వాడు. షహీన్ సోదరుల్లో ఒకడైన రియాజ్ అఫ్రిది కూడా క్రికెటరే. మరో అన్న యాసిర్ అఫ్రిది ప్రొఫెషనల్ ఫుట్‌బాలర్.