నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఙ హీరోగా ఎంట్రీ ఇస్తే చూడాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. కొన్నాళ్లుగా అదిగో ఇదిగో అనే మాటలు వినిపిస్తున్నప్పటికీ..ఎంట్రీ ఎప్పుడనే విషయంలో క్లారిటీ లేదు. కానీ తాజాగా మోక్షజ్ఙపై వేణు స్వామి(Venu Swamy) చెప్పిన జాతకం వైరల్గా మారింది.
Venu Swamy said Mokshagna Jathakam is amazing but fans are disappointed
ప్రస్తుతం ఉన్న సీనియర్ స్టార్ హీరోల్లో బాలయ్య కొడుకు మోక్షజ్ఙ(Mokshagna Teja) ఎంట్రీ మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున వారసులు హీరోలుగా రాణిస్తున్నారు. అందుకే మోక్షజ్ఙ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్నారు నందమూరి అభిమానులు. ఇప్పటికే చాలాసార్లు మోక్షజ్ఙ ఎంట్రీ గురించి వార్తలు వినిపించాయి. బాలయ్య కూడా ఎప్పుడు దీని క్లారిటీ ఇవ్వలేదు. ఆ మధ్య బాలయ్య సినిమా ‘ఆదిత్య 369’ సీక్వెల్గా ‘ఆదిత్య 999’తో హీరోగా ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. కాబట్టి త్వరలోనే మోక్షజ్ఙ ఎంట్రీ ఉంటుందని భావిస్తున్నారు బాలయ్య ఫ్యాన్స్. కానీ తాజాగా వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్గా మారాయి. సోషల్ మీడియా పుణ్యమా అని వేణు స్వామి(Venu Swamy) చాలా ఫేమస్ అయిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ సెలబ్రిటీస్ పై ఈయన చేసే కామెంట్స్ ఎప్పుడూ వైరల్ అవుతునే ఉంటాయి.
ముఖ్యంగా ఫలానా జంట విడిపోతుంది. కలిసి ఉండలేరు. విడాకులు తీసుకుంటారు అని చెబుతుంటాడు. అలాగే ఈ హీరో జాతకం ఇది. అతను అలా అవుతాడు.. అంటూ జోష్యం చెబుతుంటాడు. తాజాగా మోక్షజ్ఞ జాతకాన్ని కూడా చెప్పేశాడు. ఆయన ఎంట్రీకి ఇంకా చాలా సమయం పడుతుందని అన్నాడు. ‘అఖండ’ సినిమా షూటింగ్ సమయంలో బాలయ్యను కలిసినప్పుడే మోక్షజ్ఞ జాతకం గురించి, అతని సినీ కెరీర్ గురించి చెప్పానని చెప్పుకొచ్చాడు. అయితే మోక్షజ్ఙ జాతకం మాత్రం చాలా అద్భుతంగా ఉందని అంటున్నాడు. కాకపోతే సినీ ఎంట్రీకి ఇంకాస్త సమయం పట్టనుందని చెబుతున్నాడు. మోక్షజ్ఞ జాతకం అద్భుతమే కానీ.. ఎంట్రీ(entry) లేట్ అనే సరికి నందమూరి ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురవుతున్నారు. మరి వేణు స్వామి(Venu Swamy) చెప్పిన దాని ప్రకారం మోక్షజ్ఙ ఎంట్రీ ఎప్పుడుంటుందో చూడాలి.