»Gautam Gambhir And Sunil Joshi React To Hardik Pandyas Backup In The Asia Cup Team
Asia Cup: హర్ధిక్ పాండ్యా బ్యాకప్ విషయంలో రచ్చ
ఆసియా కప్ 2023 ఆడేందుకు భారత జట్టు తుది ఎంపిక జరిగింది. ఇందులో ఆల్ రౌండన్ హర్ధిక్ పాండ్యకు బ్యాక్ అప్‌గా శార్దుల్ ఠాకూర్ బదులు శివమ్ దూబెను తీసుకుంటే బాగుండేదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యానించగా.. జట్టులో మార్పులు అవసరం లేదని సునీల్ జోషి స్పందించారు.
Gautam Gambhir and Sunil Joshi react to Hardik Pandya's backup in the Asia Cup team.
Asia Cup: ఆసియా కప్ కోసం (Asia Cup 2023) లో ఆడే భారత్ తుది జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. జట్టులో సీనియర్లతోపాటు యువ క్రికెటర్ తిలక్ వర్మ(Tilak Varma)కు చోటు దక్కడం పట్ల హైదరాబాద్ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. మొత్తం 17 మందితో ఉన్న జట్టులో ఆల్‌రౌండర్ల జాబితాలో హార్దిక్ పాండ్య (Hardik Pandya)కు బ్యాకప్‌గా శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur)ను ఎంపిక అయ్యాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్‌ను తీసుకున్నారు. ఇదే విషయంపై మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ స్పందించారు. పాండ్యాకు బ్యాక్అప్గా శార్దూల్ ఠాకూర్ కంటే శివమ్ దూబె (Shivam Dube) ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. దీనిపై మాజీ సెలెక్టర్ సునీల్ జోషి స్పందించారు.
శివమ్ దూబె ఫామ్‌ను లెక్కలోకి తీసుకుంటే బాగుండేదని, శార్దూల్ ఠాకూర్.. పాండ్యా బ్యాకప్ భర్తీ చేయడం కష్టమని గంభీర్ అభిప్రాయపడ్డారు. జట్టులో మరో స్పిన్నర్‌కు స్థానం కలిపిస్తే బాగుండేదని, అందుకు యుజ్వేంద్ర చాహల్ లేదంటే రవి బిష్ణోయ్‌లో ఒకరిని తీసుకోవాల్సింది. ఆసియా పిచ్‌లలో స్పిన్నర్ల ప్రభావం ఎక్కవ అని.. నలుగురు పేసర్లతో బరిలోకి దిగాల్సిన అవసరం లేదన్నారు. కనీసం మరో లెగ్ స్పిన్నర్‌కు అవకాశం కల్పిస్తే బాగుండేదని గంభీర్ తెలిపాడు. జట్టులో మార్పులు అవసరం లేదని సునీల్ జోషి అన్నారు. శివమ్ దూబె టీ20ల్లో బాగానే ఆడుతున్నప్పటికీ.. వన్డే ఫార్మాట్లో రాణించడం లేదన్నారు. బౌలింగ్ కూడా గొప్పగా లేదన్నారు. శార్దూల్ ఠాకూర్ ఇటీవల అద్భుతంగా రాణించాడని పేర్కొన్నారు. గౌతమ్ గంభీర్ పట్ల తనకు గౌరవం ఉందని, ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం అని సునిల్ జోషి అన్నారు.