GST Collection: గత నెలలో స్థూల వస్తు, సేవల పన్ను (GST) ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.1,65,105 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ కింద రూ.29,773 కోట్లు, స్టేట్ జీఎస్టీ కింద రూ.37,623 కోట్లు, ఐజీఎస్టీ కింద రూ.85,930 కోట్లు వచ్చాయి. IGSTలో దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేసిన రూ. 41,239 కోట్ల పన్ను ఉంది. ఇది కాకుండా రూ.11,779 కోట్లు సెస్‌గా వసూలు చేశారు.
జీఎస్టీ ఆదాయంలో వార్షిక ప్రాతిపదికన 11 శాతం పెరుగుదల కనిపించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. దేశీయ లావాదేవీల ద్వారా ఆదాయం పెరిగింది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ. జీఎస్టీ వసూళ్లు 1.60 లక్షల కోట్లు దాటడం ఇది ఐదోసారి. జూన్‌లో ఇది రూ.1,61,497 కోట్లు. ఐజీఎస్టీ వసూళ్లలో రూ.39,785 కోట్లు సీజీఎస్టీకి, రూ.33,188 కోట్లు ఎస్జీఎస్టీకి ప్రభుత్వం ఇచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. సెటిల్మెంట్ తర్వాత రూ.69,558 కోట్ల సీజీఎస్టీ రాబడి, రూ.70,811 కోట్ల ఎస్టీఎస్టీ రాబడి వచ్చింది.
ఆగస్టు 2న సమావేశం
ఆర్థిక మంత్రి నిర్మల్ సీతారామన్ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందాలు, క్యాసినోలపై విధించిన 28 శాతం జీఎస్టీ అమలుపై చర్చించే అవకాశం ఉంది. ఆన్లైన్ గేమింగ్, గుర్రపు పందెం, క్యాసినోలపై పూర్తి విలువతో 28 శాతం GST విధించాలని జూలై 11న GST కౌన్సిల్ నిర్ణయించింది.