»Rk Roja Gave A Special Gift To Ramya Krishna Who Came Home
Minister Roja : ఇంటికొచ్చిన రమ్యకృష్ణ కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ఆర్కే రోజా
తన సహచర నటి, స్నేహితురాలు రమ్యకృష్ణకు (Ramya Krishna) మంత్రి రోజా (Roja Selvamani) బొట్టుపెట్టి, చీర పెట్టారు. తన ఇంటికి వచ్చిన అతిథికి గౌరవంగా స్వాగతం పలకడంతో పాటు మంచి ఆతిథ్యం ఇచ్చారు.
ఒకప్పటి నటి, ఏపీ పర్యటక శాఖ మంత్రి రోజా (Ministro Roja) రాజకీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. తాజగా ఆమె ఇంటికి నటి రమ్యకృష్ణ వచ్చారు. కుమారుడు రిత్విక్‌ను తీసుకుని చిత్తూరు జిల్లా నగరి (Nagiri) లోని రోజా ఇంటికి వెళ్లారు రమ్యకృష్ణ. రోజా, సెల్వమణి దంపతులు రమ్యకృష్ణ(Ramya Krishna)కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. ఆ తరవాత కాసేపు రోజా కుటుంబంతో రమ్యకృష్ణ సరదాగా గడిపారు. రమ్యకృష్ణ బయలుదేరే ముందు ఆమెకు బొట్టుపెట్టి, చీర పెట్టి పంపారు రోజా. ఈ మేరకు రోజా ఫొటోలు, వీడియోను సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేశారు. రోజా ఇంట్లో రమ్యకృష్ణ కాసేపు ఉండి రోజాతో ముచ్చటించింది. రోజా తన ఇంటిని అంతా రమ్యకృష్ణకు చూపించింది. వెళ్లేముందు రోజా రమ్యకృష్ణకు స్పెషల్ గా బొట్టు పెట్టి, చీర పెట్టి పంపించింది.
అలాగే తనతో దిగిన ఫోటోలు, రమ్యకృష్ణకు చీర పెట్టిన వీడియోని రోజా తన సోషల్ మీడియా (Social media) లో షేర్ చేసింది. ఆ ఫోటోలని షేర్ చేస్తూ రోజా ఎమోషనల్ పోస్ట్ చేసింది.రోజా కూడా అప్పట్లో అందరి స్టార్ హీరోల సరసన ఇంచుమించుగా నటించేసింది. రోజా, రామకృష్ణ ఇద్దరు హీరోయిన్లు ఒకే టైంలో తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగారు. వీళ్ళిద్దరి మధ్యన మంచి స్నేహం కూడా ఉంది. వీళ్ళిద్దరూ కలిసి ముగ్గురు మొనగాళ్లు, సమ్మక్క సారక్క(Sammakka Sarakka), అన్నమయ్య మొదలగు సినిమాల్లో నటించారు. కాలం గడిచే కొద్దీ ఎంతటి వారి మధ్యనైనా దూరం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే.. ఎవరి జీవిత విధానంలో వాళ్ళు బిజీ అయిపోతారు. రోజా సినిమా రంగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగం (Political field) లోకి అడుగుపెట్టిన తర్వాత.. ఆమె విపరీతమైన బిజీ అయిపోయింది. ఇక ఆమె నిరంతరం టీవీ షోస్ (TV shows) తో పాటు.. రాజకీయ పరంగా ఎప్పుడూ అభిమానులకు అందుబాటులోనే ఉంటూ మంచి ఫేమ్ తోనే నడుస్తుంది.