BRO movie: బ్యాడ్ న్యూస్ ‘బ్రో’..స్పెషల్ షోస్ లేనట్టే!
పవర్ స్టార్ సినిమా వస్తుందంటే.. ఆ రోజు అభిమానులకి పండగే. ఇక బెనిఫిట్ షోలు ఉంటే.. ముందు రోజు నుంచే థియేటర్ల దగ్గర హడావిడి స్టార్ట్ అయిపోతుంది. పవర్ స్టార్ కటౌట్స్తో పవన్ ఆర్మీ చేసే రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈసారి అలాంటిదేం లేదని అంటున్నారు.
పవన్ ఫ్యాన్స్ థియేటర్లోకి వెళ్లాక పవన్ ఎంట్రీకి, డైలాగ్స్‌కి, ఆ మ్యానరిజమ్‌కి పేపర్లు చిరిగిపోవాల్సిందే. ఆ సమయం కోసం మిడ్ నైట్ నుంచే నిద్ర మానుకొని మరీ ఎదురు చూస్తుంటారు పవన్ ఫ్యాన్స్. అది కూడా ఎర్లీ మార్నింగ్ ఉండే బెనిఫిట్ షోలలో.. ఆ రచ్చ మామూలుగా ఉండదు. కానీ ఈసారి మాత్రం అలా ఉండదని అంటున్నారు బ్రో(BRO) మూవీ మేకర్స్. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ కలయికలో.. సముద్రఖని దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రో’ సినిమా.. జూలై 28న రిలీజ్‌కు రెడీ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే.. ప్రమోషన్స్‌లో భాగంగా.. టీజీ విశ్వప్రసాద్, బ్రో సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
టికెట్ రేట్ల గురించి అడగ్గా.. అనుకున్న బడ్జెట్లోనే ఈ సినిమాని పూర్తి చేశాం. బిజినెస్ కూడా బాగా జరిగింది. అందుకే ఈ సినిమా కోసం టికెట్ ధరలు పెంచే ఆలోచన లేదని అన్నారు. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లతోనే రిలీజ్ చేస్తున్నామని అన్నారు. దీంతో.. ఇక టెన్షన్ లేదు బ్రో అని అంటున్నారు పవన్ ఫ్యాన్స్. ఎందుకంటే.. ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు వస్తే చాలు.. టికెట్ రేట్లు పెరుగుతున్నాయి. కాబట్టి.. పవన్ ఫ్యాన్స్‌కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. కానీ ఇదే సమయంలో ఓ బ్యాడ్ న్యూస్ కూడా చెప్పారు టీజీ విశ్వప్రసాద్. ఈ సినిమాకు ఎలాంటి అదనపు షోలు కూడా ఉండవని అన్నారు. దీంతో.. ఎర్లీ మార్నింగ్ సినిమా చూడాలి అనుకునే పవన్ ఫ్యాన్స్‌కి.. ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. అయితే అభిమానుల నుంచి ఒత్తిడి వస్తే స్పెషల్ షో వెయ్యమని చెప్పలేమని అన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ప్రీమియర్ షోలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు. మరి బ్రో స్పెషల్ షోస్ ఉంటాయో లేదో చూడాలి.