ఏ మాయ చేశావే సినిమా నాగచైతన్య, సమంతకు బిగ్ బ్రేక్ ఇవ్వడంతో పాటు.. వాళ్ల జీవితాలను కూడా మలుపు తిప్పింది. ఈ సినిమాలో నటించినప్పుడే సామ్, చై లవ్‌లో పడ్డారు.. చాలా కాలం పీకల్లోతు ప్రేమలో మునిగి తేలారు.. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. ఆపైన నాలుగేళ్లకు విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీళ్ల డివోర్స్ హాట్ టాపిక్‌గానే ఉంది. ఇలాంటి సమయంలో సమంత, చైతూ కలిసి ‘ఏ మాయ సీక్వెల్’లో నటిస్తారా.. అంటే కష్టమనే చెప్పాలి. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా 2010లో వచ్చింది. అయితే ఇప్పుడు పుష్కర కాలం తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ ప్లానింగ్‌లో ఉన్నాడు గౌతమ్ మీనన్. ప్రస్తుతం స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నానని.. రీసెంట్గా చెప్పుకొచ్చాడు గౌతమ్. త్వరలోనే ఈ హిట్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు సమాచారం. అయితే ఇంకా హీరో, హీరోయిన్లు ఎవరనే విషయంలో క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సీక్వెల్లోను నాగచైతన్యనే హీరోగా నటించనున్నట్టు తెలుస్తోంది. ఇక హీరోయిన్గా సమంత చేసే ఛాన్స్ లేదు కాబట్టి.. హాట్ బ్యూటీ రష్మిక మందన తీసుకున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే సమంత పాత్రను ఈ సినిమా నుంచి తీసేయాలంటే.. నిజంగానే ఈ ఇద్దరు డివోర్స్ తీసుకున్నట్లుగానే.. సినిమాలోను చూపించబోతున్నారట. అందుకే సమంత ప్లేస్‌లో రష్మిక ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు. మరి ఈ క్రేజీ సీక్వెల్ ఎప్పుడుంటుందో చూడాలి.