TPT: ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ బి. సుధారాణి శనివారం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ నరసింహులు, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ శ్రీ దేవేంద్రరెడ్డి ఆమెను ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. వివిధ శాఖల్లో విధులు నిర్వహించిన సమయంలో సుధారాణి నిబద్ధతతో, సమర్థతతో పనిచేశారని కొనియాడారు.

