KKD: కోటనందూరు మండలం అల్లిపూడిలో కనుమ పండగ రోజు దారుణ చోటుచేసుకుంది. కత్తులు, ఇనుప రాడ్లతో ఇద్దరు టీడీపీ నేతలపై ప్రత్యర్థులు జరిపిన దాడిలో లాలం బంగారయ్య (36) మృతి చెందాడు. చింతకాయల శ్రీరామ్ అనే మరో వ్యక్తి తీవ్రంగా గాయపడగా.. కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో వైసీపీకి చెందిన మండల నాయకుడి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.