BDK: కొత్తగూడెం నగర పాలక సంస్థలో ఓటర్ల జాబితాను డివిజన్, పోలింగ్ బూత్ వారీగా ప్రచురించడం జరిగిందని కమిషనర్ సుజాత ప్రకటించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 11, 12 ప్రకారం, ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 60 డివిజన్లు, 201 పోలింగ్ బూత్ల జాబితాను విడుదల చేశామని తెలిపారు. తహశీల్దార్, ఆర్డీవో, సబ్ కలెక్టర్ కార్యాలయంలో అందుబాటులో ఉందన్నారు.