MLG: గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామానికి చెందిన గురుస్వామి గాజుల కుమారస్వామి (56) మకర సంక్రాంతి రోజు మకరజ్యోతి దర్శనం సమయంలో అనారోగ్యంతో మృతి చెందాడు. దాదాపు 20 సార్లు అయ్యప్ప మాల ధరించి అనేకమందికి గురుస్వామిగా ఉన్న ఆయన స్వామి సేవలో తరిస్తూ పండుగ రోజే అయ్యప్పలో ఐక్యమయ్యారని సహచర భక్తులు కన్నీటి పర్యంతమయ్యారు.