NLG: నల్గొండ మున్సిపాలిటీని నగర పాలక సంస్థగా మారుస్తూ గెజిట్ విడుదల చేసిన నేపథ్యంలో శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ పాత మున్సిపాలిటీ భవనంలోనే కలెక్టర్ చంద్రశేఖర్‌తో కలిసి నల్గొండ నగరపాలక సంస్థ కార్యాలయాన్ని ప్రారంభించారు. మాజీ మున్సిపల్ ఛైర్మెన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మెన్ హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.