RR: నందిగామ సర్పంచ్ కొమ్ము కృష్ణ సమస్యలపై అధ్యయనానికి శ్రీకారం చుట్టారు. వార్డు సభ్యులతో కలిసి ఒక్కో రోజు ఒక్కో వార్డులో సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నారు. శనివారం ఒకటవ వార్డులో వార్డు మెంబర్ ప్రసాద్ ఆధ్వర్యంలో అండర్ డ్రైనేజీ మరమ్మత్తు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రణాళిక బద్ధంగా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.