PDPL: ఎలిగేడు మండలం దులికట్టకు చెందిన రేవెల్లి సంపత్ 16 ఏళ్ల క్రితం ప్రమాదానికి గురై వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న సంపత్ బాల్య మిత్రులు మానవత్వంతో స్పందించి, రూ.25,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టాల్లో ఉన్న తమ స్నేహితుడికి అండగా నిలిచి వారు చాటుకున్న ఔదార్యంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.