NRPT: ఊట్కూర్ మండలం పులిమామిడి గ్రామ పరిధిలో ప్రభుత్వ అనుమతి లేకుండా మొరం తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు శనివారం పట్టుకున్నారు. తనిఖీ సమయంలో డ్రైవర్లు చపలి రఘు, వడ్డె రమేష్ అనుమతి పత్రాలు చూపకపోవడంతో కేసు నమోదు చేశారు. అధికారులు అక్రమ తరలింపులపై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు.