MLG: మేడారం జాతర సందర్భంగా అత్యవసర వైద్య సేవల కోసం 35 అంబులెన్సులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటు, ప్రమాదాల వంటి సందర్భాల్లో గోల్డెన్ అవర్లో చికిత్స అందించి, అవసరమైతే రోగులను ములుగు ప్రభుత్వ ఆసుపత్రి, ఎంజీఎం ఆసుపత్రికు 108 అంబులెన్సుల ద్వారా తరలిస్తామని, ఆసుపత్రుల్లో 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు.