PDPL: సుల్తానాబాద్ మండల కేంద్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, స్థానిక సీఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ చంద్రకుమార్ మున్సిపల్ కమిషనర్‌తో కలిసి అన్ని పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, ఓటర్లకు అవసరమైన సౌకర్యాలపై అధికారులతో సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిస్తామన్నారు.