MBNR: దేశంలోని బడుగు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 2005లో యూపీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకు వచ్చిందని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు.