NRML: పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన అనిల్ చంద్రకళ ల మూడేళ్ల కుమారుడు అశ్విన్ అదృశ్యమైనట్లు టౌన్ సీఐ నైలు నాయక్ తెలిపారు. శనివారం ఆరుబయట ఆడుకుంటున్న అశ్విన్ అదృశ్యం కాగా కుటుంబీకులు బాలుని ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో గాలించినప్పటికీ దొరకకపోగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసామన్నారు.