VSP: పెందుర్తి జోన్ 88వ వార్డులో జీవీఎంసీ నిధులతో రూ.2.94 కోట్ల అభివృద్ధి పనులకు నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి శనివారం శంకుస్థాపన చేశారు. రోడ్లు, కాలువలు, కల్వర్టులు, బరియల్ గ్రౌండ్, నీటి పైపుల మార్పు పనులు చేపడతామని, నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.