సినిమా పరిశ్రమలో మేనేజర్లు మీద నమ్మకంతోనే హీరో, హీరోయిన్స్ ముందుకు వెళ్తూంటారు. వారి కెరీర్ ని ముందుకు తీసుకెళ్లాలన్నా, తొక్కేయాలన్నా వీరి కృషే ఎక్కువ ఉంటుంది. అయితే మేనేజర్స్ (Managers) కు కమీషన్ బేసిస్ మీద పారితోషికం ఉంటుంది కాబట్టి తమ హీరో లేదా హీరోయిన్ (Heroine) ఎదుగుదల కోసం కృషి చేస్తూంటారు. మరీ ముఖ్యంగా పర భాషా హీరోయిన్లు తెలుగు సినిమాల్లోకి అడుగు పెడితే.. వాళ్లకు ఇక్కడ అన్నీ చూసుకునేది మేనేజర్లే ఇప్పుడు రష్మిక కూడా అదే పరిస్దితి ఎదుర్కొందని సమాచారం. ప్రముఖ నటి రష్మిక మందన్నా(Rashmika Mandanna) తన మేనేజర్ ను ఉద్యోగం నుంచి తొలగించినట్టు తెలుస్తోంది. మేనేజర్ ఆమెను రూ.80 లక్షలకు మోసగించినట్టు బయటపడడంతో రష్మిక ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.
రష్మిక కెరీర్ ఆరంభం నుంచి మేనేజర్ గా ఒకే వ్యక్తి పనిచేస్తుండడం గమనార్హం. దీనిపై రష్మిక అధికారికంగా స్పందించలేదు. తనను రూ.80 లక్షలకు మోసగించినట్టు గుర్తించిన రష్మిక దీనిపై రాద్ధాంతం జరగకుండా జాగ్రత్త పడినట్టు సమాచారం. దీనికి స్పందనగా అతడ్ని మేనేజర్ బాధ్యతల నుంచి తప్పించినట్టు తెలుస్తోంది. కాగా, రష్మిక త్వరలో యానిమల్ సినిమా(yanimal movie)లో రణబీర్ కపూర్, అనిల్ కపూర్ (Anil Kapoor) తోపాటు నటించనుంది. ఈ సినిమా ఆగస్ట్ 11న విడుదల కానుంది. మరోవైపు పుష్ప2 (Pushpa2) సినిమా సీక్వెల్ లోనూ నటిస్తోంది.దీంతో పాటు భీష్మ తర్వాత మళ్లీ నితిన్, వెంకీ కుడుముల(Venky Kudumula)తో కలిసి ఓ సినిమాలోనూ నటిస్తోంది రష్మిక. హిందీలో అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి(Sandeep Reddy) డైరెక్షన్లో రణబీర్ కపూర్‌తో చేస్తున్న యానిమల్ మరో క్రేజీ ప్రాజెక్టు. ఇది కాక తెలుగు, తమిళ భాషల్లో రెయిన్బో అనే సినిమాలోనూ రష్మిక నటిస్తోంది.