SS: నల్లమాడ మండలం పెమనకుంటపల్లిలో రైతు శంకర్ నాయక్ నిర్మించిన ప్రభుత్వ మినీ గోకులం షెడ్‌ను ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ప్రారంభించారు. పల్లె పండుగ 2.0లో కురుమాల ఓబులేసుకు మంజూరైన మరో మినీ గోకులం షెడ్‌కు భూమిపూజ చేశారు. మినీ గోకులాల ద్వారా పశువులకు రక్షణ కలుగుతుందన్నారు.