KDP: రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు.. స్టాప్, ఫేస్ వాష్ అండ్ గో కార్యక్రమం కొనసాగుతోంది. అర్ధరాత్రి లారీలు, బస్సులు, కార్లు,వ్యాన్ల డ్రైవర్లను నిలిపి నీళ్లతో ముఖం కడిగించి అప్రమత్తం చేసి పంపుతున్నారు. వాహనాలు నడుపుతున్నప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుంచుకుని జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని పోలీసులు సూచించారు.