BHPL: రేగొండ మండల కేంద్రంలోని కొడవటంచలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఫిబ్రవరిలో ఆలయ పునఃప్రతిష్ఠాపన మహోత్సవానికి ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి రానున్నట్లు తెలిపారు. ఆయన వెంట పలువురు అధికారులు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.