KDP: ఒంటిమిట్ట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోనరాజుపల్లె వీఆర్వో శ్రీనివాసరావు ఎన్ఓసీ కోసం రూ.15,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. కోనరాజుపల్లె రైతులు రాజారెడ్డి, రమణారెడ్డి ఫిర్యాదు మేరకు కడప ఏసీబీ డీఎస్పీ సీతారాముడు నేతృత్వంలో మరో ఏడుగురు సిబ్బంది ఈ దాడుల్లో పాల్గొన్నారు.