SKLM: కొత్తూరు మండలం పారాపురం హైస్కూల్లో ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గోవిందరావు పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులతో కలిసి భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. పాఠశాల సంక్రాంతి సంబరాల ఉత్సవాల కోసం రూ.15వేలు ఎంఈవోకి అందించారు.