VSP: పీఎంపాలెం పరిధి కార్ షెడ్ సిగ్నల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆటో ఢీకొట్టింది. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం 108లో KGHకి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందాడు. మృతుడు లక్ష్మీవానిపాలెంలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఇతని వివరాలు తెలిసిన వారు పీఎంపాలెం పోలీసులను సంప్రదించాలని కోరారు.