VZM: బొండపల్లి మండలంలోని ముద్దూరు గ్రామ సచివాలయాన్ని మండల ప్రత్యేక అధికారి సాల్మన్ రాజు ఆకస్మికంగా శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను నిశితంగా పరిశీలించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ప్రగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా సర్వే చేపట్టాలన్నారు. సర్వేలో బాగా వెనుకబడి ఉందని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.