WGL: పర్వతగిరి మండల కేంద్రంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల బిక్షాటన చేసే వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానిక సర్పంచ్ శంకర్, పోలీస్ అధికారులు శుక్రవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ లభించలేదని పోలీసులు తెలిపారు. ఎవరైనా గుర్తిస్తే పర్వతగిరి పోలీస్ స్టేషన్, ఎస్సై ప్రవీణ్ (8712685028, 8712685242)ను సంప్రదించాలని కోరారు.