SS: కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లికి చెందిన మాదినేని మహేష్ హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆర్థిక లావాదేవీలు, పాత గొడవలే ఈ హత్యకు కారణమని డీఎస్పీ విజయ్ కుమార్ వెల్లడించారు. నిందితుల నుంచి ఒక ఇన్నోవా, రెండు బైకులు, ఐరన్ పైపు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.