వీధిలోని ప్రతి కుక్కను తరలించమని తాము ఆదేశించలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గురువారం జరిగిన విచారణలో తమ పాత ఆదేశాలపై న్యాయస్థానం కీలక వివరణ ఇచ్చింది. కేవలం కార్యాలయాలు, అధికారిక సంస్థల ప్రాంగణాల నుంచి మాత్రమే కుక్కలను తరలించాలని చెప్పామే తప్ప, సాధారణ వీధుల నుంచి కాదని ధర్మాసనం వెల్లడించింది.