ఉమ్మడి మెదక్ జిల్లాలో పురపాలక ఎన్నికల నగారా మోగకముందే ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. మున్సిపాలిటీలపై జెండా ఎగురవేయడమే లక్ష్యంగా గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నాయి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కొనసాగుతుండగానే, వార్డుల వారీగా బలమైన అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నేతలు నిమగ్నమయ్యారు.