NGKL: మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో నాగర్ కర్నూల్ కలెక్టర్, అదనపు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. 3 మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా జాబితాను వార్డుల వారీగా కచ్చితంగా రూపొందించాలని ఆదేశించారు.