సత్యసాయి: సోమందేపల్లి(మం) మాగేచెరువు గ్రామంలో పాఠశాల బిల్డింగ్ నిర్మాణం కొరకు అనుమతులు మంజూరు చేయాలని సగర/ఉప్పర కార్పొరేషన్ ఛైర్మన్ వెంకటరమణ కలెక్టర్‌ను కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. మాగేచెరువులో ప్రస్తుతం ఉన్న పాఠశాల బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందని కలెక్టర్‌కు వివరించారు.