కోనసీమ: రావులపాలెం మండలం వెధిరేశ్వరం కోసూరు నగర్లో కేరళ, రాజస్థాన్ శైలిలో 75 శాతం స్టీల్ ఉపయోగించి నిర్మించిన గృహం చూపరులను ఆకట్టుకుంటోంది. ఆధునిక సాంకేతికతతో బలమైన నిర్మాణంగా రూపొందిన ఈ ఇల్లు జిల్లాలోనే మొట్టమొదటిదిగా స్థానికులు చెబుతున్నారు. వినూత్న డిజైన్తో పాటు భద్రత, దీర్ఘకాలిక మన్నిక ఈ గృహానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.