మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్వీరాజ్ చావాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ.. వెనెజులా అధ్యక్షుడు మదురోను కిడ్నాప్ చేసినట్లుగా మోదీతో ట్రంప్ వ్యవహరిస్తారా? అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. ‘కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చవాన్ భారత్ పరిస్థితిని వెనెజులాతో పోల్చడం సిగ్గుచేటు’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ పేర్కొన్నారు.