»Biporjoy Cyclone Reach June 15th Evening Gujarat Coast 74 Thousand People Evacuated
Biporjoy cyclone: ఈరోజు తుఫాను బీభత్సం..74 వేల మంది తరలింపు
బిపార్జోయ్ తుఫాను(Biporjoy cyclone) గుజరాత్ తీరానికి దగ్గరికి వచ్చింది. ఈరోజు(గురువారం) సాయంత్రం తీరం దాటనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతోపాటు తీవ్రమైన గాలులు వస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాల్లో ఉన్న 74 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
సైక్లోన్ బిపార్జోయ్(Biporjoy cyclone) గుజరాత్ తీరానికి 200 కిలోమీటర్ల కంటే తక్కువ దూరంలో ఉంది. గురువారం సాయంత్రం నాటికి ఇది తీరానికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారీ వర్షంతోపాటు తీవ్ర మైన గాలులు వీచే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీర ప్రాంతాల్లో నివసిస్తున్న 74,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు అధికారులు తరలించారు. కచ్ జిల్లాలోని సముద్ర తీరం నుంచి 10 కి.మీ మధ్య ఉన్న దాదాపు 120 గ్రామాల నుంచి ప్రజలను తరలించినట్లు అధికారులు తెలిపారు. భారత వాతావరణ శాఖ (IMD) ప్రకారం బిపార్జోయ్ జఖౌ నౌకాశ్రయానికి సమీపంలో చాలా తీవ్రమైన తుఫానుగా వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆ క్రమంలో గరిష్ట గాలి వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు ఉంటుందని వెల్లడించారు.
మరోవైపు ఈ ప్రకృతి వైపరీత్యం నుంచి ప్రజల(people) ఇబ్బందులను పరిష్కరించేందుకు ఆర్మీ, నేవీ, వైమానిక దళం సహా ఇండియన్ కోస్ట్ గార్డ్లు సిద్ధంగా ఉన్నారు. గుజరాత్‌లోని బిపార్జోయ్ తుఫాను దృష్ట్యా స్థానికులకు సహాయం అందించేందుకు ఇప్పటికే అన్ని సిద్ధం చేశారు. దీంతోపాటు బిపార్జోయ్ తుఫాను కారణంగా గేట్‌వే ఆఫ్ ఇండియా వద్ద సముద్రం మారుతుంది. ఇది గుజరాత్లో తీరాన్ని తాకింది. ముంబైలో ఉదయం 10.29 గంటలకు అధిక ఆటుపోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ఆ క్రమంలో ప్రజలు తీరం వైపు వెళ్లకూడదని హెచ్చరికలు జారీ చేశారు.
బైపార్జోయ్ తుఫాను ప్రధానంగా కచ్ఛ్‌లో 2-3మీటర్ల ఎత్తులో అలలు(floods) ఎగసిపడే అవకాశం ఉందని, పోర్బందర్, ద్వారక జిల్లాల్లో తీవ్రమైన ప్రభావంతో గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పోర్బందర్ ఓఖా వద్ద ఐదు సహాయక బృందాలు, వల్సురా వద్ద 15 సహాయక బృందాలు సిద్ధంగా ఉన్నాయి. గోవాలోని ఐఎన్ఎస్ హంసా, ముంబైలోని ఐఎన్ఎస్ షిక్రా వద్ద గుజరాత్‌కు బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి.
#WATCH | Sea water enters houses located at the coast as tidal waves lash Mangrol in Junagarh district of Gujarat pic.twitter.com/AvV2XMpLXy